Album: Aakasam Eenatidho
Singer: S. Janaki
Music: Ilaiyaraaja
Lyrics: Acharya Atre
Label: Aditya Music
Released: 1982-01-01
Duration: 03:57
Downloads: 4577252
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం
ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది ఏ ముద్దు ఏ
మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా పరువాలే ప్రణయాలై, స్వప్నాలే స్వర్గాలై
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను ఆకాశం ఏనాటిదో అనురాగం
ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం
ఆనాటిది ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించెనో హృదయాలే
తెర తీసి తనువుల కలబోసి మరపించమనగా కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించి
గెలిపించమనగా మోహాలే దాహాలై, సరసాలే సరదాలై కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలి
వెలలేని విలువలు ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు
కలిగెనో ఆనాడే తెలిసిందది