Album: Aakasamlo
Singer: S. Janaki
Music: Ilaiyaraaja
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 1988-06-15
Duration: 04:30
Downloads: 2297621
ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన ఆ లోకం
అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన
పొదరిల్లు మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా వయ్యారి వానజల్లై దిగిరానా సంద్రంలో
పొంగుతున్న అలనైపోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా
నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన
పొదరిల్లు అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చే తారలెన్నో
మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలీనే సోయగాన చందమామ మందిరానా
నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే
పూసిన పొదరిల్లు అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా
ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు