Album: Aasa Chinna
Singer: Sunitha
Music: Nihal
Lyrics: Jillela Varaprasad
Label: Aditya Music
Released:
Duration: 04:25
Downloads: 127944
ఆశ చిన్ని ఆశ నన్ను చూసి మాయగా శ్వాస కొత్త శ్వాస
నన్ను చేరే హాయిగా నేను నడిచే దారిలో నాకు దొరికే తోడుగా
నేను వెతికే ఊహలో నన్ను నడిపే నావగా ఎదురే చేరి ప్రేమించగా
ఆశ చిన్ని ఆశ నన్ను చూసి మాయగా శ్వాస కొత్త శ్వాస
నన్ను చేరే హాయిగా గతంలోన కథల్లోన చూడని పథంలోన పతంగాల
ఆమని నన్ను చూసి నాతో ఆడేనా వనం లోని విహంగాల సారిక
ఇలా నన్ను వెతుక్కుంటు వాలగ జంట చేరి నాతో పాడేనా వేల
వేల ఆశల్లోన సూర్యోదయం కోటి కోటి తారల్లోన చంద్రోదయం హరివిల్లులో కొత్త
రంగునై చేరనా ఆశ చిన్ని ఆశ నన్ను చూసి మాయగా శ్వాస
కొత్త శ్వాస నన్ను చేరే హాయిగా వయ్యారాల వసంతాల వాకిట
స్వరంలోన పదాలల్లి పాడగ మేఘమాల నేనై సాగేనా పదారేళ్ళ పసందైన కోరిక
పదా అంటూ పిలుస్తున్న వేడుక పారిజాత పువ్వై పూసేనా గాలి నీరు
నేలా నింగి దీవించగా అంతులేని ఆనందాలే లోగిళ్ళుగా తొలి వేకువై కొత్త
లోకమే చూడనా ఆశ చిన్ని ఆశనన్ను చూసి మాయగా లాలలాలలాలలాలలాల హాయిగా