Album: Asha Pasham
Singer: Anurag Kulkarni, Sweekar Agasthi, Damini Bhatla
Music: Sweekar Agasthi
Lyrics: Viswa
Label: Aditya Music
Released: 2018-08-20
Duration: 04:20
Downloads: 16855490
ఆశ పాశం బంధీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా
తీరం సేరేలోగానే ఏ తీరౌనో సేరువైన సేదు దూరాలే తోడౌతూనే ఈడే
వైనాలే నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో ఆటు పోటు గుండె మాటుల్లోన...
సాగేనా ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో లోలో లోలోతుల్లో ఏలేలో
ఎద కొలనుల్లో నిండుపున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సిమ్మసీకటల్లిపోతుంటే, నీ గమ్యం గందరగోళం
దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు పల్లటిల్లిపోయి నీవుంటే, తీరేనా నీ ఆరాటం ఏ
హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటౌనో తేలాలంటే, నీ
ఉనికి ఉండాలిగా ఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా
ఆశ పాశం బంధీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా
తీరం సేరేలోగానే ఏ తీరౌనో ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా
విధి వేచున్నదో ఏ మలుపులో ఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ
శైలిలో సిగ్గు ముల్లు గప్పి రంగులీనుతున్న లోకమంటె పెద్ద నాటకమే,
తెలియకనే సాగే కధనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి
పోతుంటే, కంచికి నీ కధలే దూరం నీ సేతుల్లో ఉంది సేతల్లో
సూపించి ఎదురేగి సాగాలిగా రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా ఓ... ఆటు
పోటు గుండె మాటుల్లోన... ఉంటున్నా