Album: Atu Nuvve
Singer: Neha Bhasin
Music: Devi Sri Prasad
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2015-06-24
Duration: 05:02
Downloads: 6447138
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు
వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు
నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపైనా, పెదవులపైన ప్రతిమాట నువ్వే
అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం
తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గురుతుకురాదా క్షణమైన ఎదురుగ
ఉన్నా నిజమే కానీ కలవైనావులే రంగు రూపమంటూ లేనే లేనిదీ
ప్రేమ చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది దూరం దగ్గరంటూ తేడా
చూడదీ ప్రేమ నీలా చెంత చేరి నన్ను మాటాడిస్తుందే కనుపాప లోతులో
దిగిపోయి ఇంతలా ఒక రెప్ప పాటు కాలమైన మరపే రావుగా ఎద
మారుమూలలో ఒదిగున్న ప్రాణమై నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగా
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు
వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు
నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపైనా, పెదవులపైన ప్రతిమాట నువ్వే
నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే నేనే నువ్వయ్యేలా ప్రేమ
గొడవై ఎదిగావే మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే ఎటుగా చూడనంటూ
నన్ను ఒంటరి చేసావే ఏకాంత వేళలో ఏ కాంతి లేదురా నలుసంత
కూడ జాలి లేని పంతాలేంటిలా నీ తోడు లేనిదే మనసుండ లేదురా
నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదెలా అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి
చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది
నువ్వే అదమరుపైనా, పెదవులపైన ప్రతిమాట నువ్వే