Album: Chinuku Thadiki
Singer: Usha
Music: R.P. Patnaik
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 05:01
Downloads: 2575949
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు
నువ్వమ్మా మువ్వలే మనసుపడి పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా
సాగే అందాల సెలయేరమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా చినుకు
తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
స రి గ సా, స రి గ సా,
రి గ మ దా ని స రి గ సా,
స రి గ సా, ని ద మ దా ని
సా సా ని ని దా ద మా మా గ
మా ద ని రి స ద ని ని ద
ద ని ని గ గ ని ని ద ద
ని ని గ గ స గ మ గ సా
ని ద ని మ ద ని స ని స
గ స గా పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు
పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ పచ్చనైన వరి
చేలా సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే
ముద్దుగుమ్మ పాల కడలి కెరటాల వంటినీ లేత అడుగు తన ఎదను
మీటినీ నేలమ్మా పొంగేనమ్మా ఆగని సంబరమా ఆగని సంబరమా
స గ మ దా ని స సా ని ద
మ గ స గ స గ మ దా ని
స సా ని ద మ గ స గ స
గ స మా గ స దా మ ద ని
ద మా గ మ ద ని సా స ని
స, స ని స, ని స ని స ని
స గా ని స స ని స, స ని
స, ని స ని స ని స గా ని
స ద ద ని ని, ద ద ని ని
ద ద ని ని గ స పా వరములన్ని
నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల
బొమ్మా సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీ హరిగా మారునని
రాసిపెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా అన్నమయ్య శృంగార కీర్తనల
వర్ణాలకు ఆకారమైన బంగారు చిలకావమ్మా రాముని సుమ సెరమా రాముని
సుమ సెరమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి
కనుల చిలిపి కలవు నువ్వమ్మా మువ్వలు మనసుపడి పాదమా ఊహలే ఉలికి
పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ ఆమని మధువనమా ఆమని
మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి
కలవు నువ్వమ్మా