Album: Ghal Ghal
Singer: S.P. Balasubrahmanyam
Music: Devi Sri Prasad
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2004-12-14
Duration: 05:19
Downloads: 4616014
(ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)
(ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం
తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే అణువణువును మీటె మమతల
మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆపరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన
చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో
నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే
ప్రేమంటే (ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల
ఘల్ ఘల్) (ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల
ఘల్ ఘల్) ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో
గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం
ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసె మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితను సైతం చదవనివైనం కవితను సైతం పలకని భావం సరిగమ
లెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే
వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
(ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్
ఘల్) (ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్
ఘల్) మండే కొలిమినడగందే తెలియదే మన్నుకాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరె ప్రియురాలే గెలుపంటె తను కొలువై
ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానై అడగక దొరికే
వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జతవుంటే నడకల్లో
తడబాటైనా నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే
ఆ కాంతె నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా (ఘల్ ఘల్ ఘల్
ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్) (ఘల్ ఘల్ ఘల్
ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)