Album: Kani Penchina Ma Ammake
Singer: Bharath
Music: Anup Rubens
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2018-08-27
Duration: 04:08
Downloads: 3106207
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది
ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తియ్యగా ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా అ ఆ
ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా అడుగులు నడకలు నేర్పిన
నాన్నకి మార్గం అవుతున్నా పిల్లలు వీళ్లే అవుతుండగా ఆ అల్లరి నేనే
చూస్తుండగా కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది
ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తియ్యగా ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా కమ్మని బువ్వను
కలిపిన చేతిని దేవత అంటున్నా కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల
కడుతున్నా జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా మీరూపిన ఆ
ఊయల నా హృదయపు లయలో పదిలము కద ఇది ప్రేమ ప్రేమ,
తిరిగొచ్చే తియ్యగా ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని
తడిమిన తడిపిన క్షణము కదా