Album: Kanulu Kalanu Piliche
Singer: Haricharan, Chinmayi Sripada
Music: Ilaiyaraaja
Lyrics: Rehman
Label: Aditya Music
Released: 2015-12-29
Duration: 04:55
Downloads: 274157
కనులు కలను పిలిచే నిదుర తలుపు తెరిచే మనసు పరుపు
పరిచే చెలిమి జతగా నిలిచే మేఘాల తేలి నీ చెంతవాలి మనసా
ఈ చల్లగాలి పాడింది లాలి తెలుసా కనులు కలను పిలిచే
నిదుర తలుపు తెరిచే మనసు పరుపు పరిచే చెలిమి జతగ నిలిచే
బదులు రాని పిలుపులాగ గతము మిగిలినా విడిచిపోని గురుతులాగ అడుగు
కలపనా తెలుపలేని తపనలేవో ఎదని తొలిచినా మరుపురాని మమతలాగ ఎదుట నిలవనా
బతుకులోని బరువులన్ని వదిలి కదిలిపో కలత తీర కలలు చేరి వదిగి
వదిగిపో నిదురపో నిదురపో నిదురలో కలిసిపో అలసి సొలసి నిదుర నదినా
కునుకు పడవా కనులు కలను పిలిచే నిదుర తలుపు తెరిచే
మనసు పరుపు పరిచే చెలిమి జతగా నిలిచే ఎవరు నీవు
ఎవరు నేను ఎవరికెవరులే మధురమైన వరము ఏదో మనని కలిపెలే చెదిరిపోయి
ఎగిరిపోయి వెలుగు ముగిసినా నిసిని దాటి దిశలు మారే ఉదయమవునులే శిసిరమైన
పసిడి పూలు మరల పూయులే శిథిలమైన హృదయ వీధి తిరిగి వెలుగులే
తెలుసుకో తెలుసుకో మనసునే గెలుచుకో మనసు గెలిచి తెగువ మరచి కలలు
కనవా కనులు కలను పిలిచే నిదుర తలుపు తెరిచే
మనసు పరుపు పరిచే చెలిమి జతగా నిలిచే మేఘాల తేలి నీ
చెంతవాలి మనసా ఈ చల్లగాలి పాడింది లాలి తెలుసా కనులు
కలను పిలిచే నిదుర తలుపు తెరిచే మనసు పరుపు పరిచే చెలిమి
జతగా నిలిచే