Album: Musugu Veyyoddu
Singer: Kalpana
Music: Devi Sri Prasad
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2014-08-08
Duration: 05:10
Downloads: 2396598
ఊఁ ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద
హే ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు
వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో ఎవడి
ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా మనసు చెప్పిందె
మనకు వేదం కాదనే వారె లేరురా మనకు తోచిందే చేసి చూద్దాం
ఎవరు ఏమంటె ఏంటిరా హా ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు
వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యద్దు
మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని
తుఫాను వేగాలతో సూర్యుడైనా చూపగలడ రేయిచాటున్న రేపుని అఁ చీకటైనా
ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని హా
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ల ముందుండగా
అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటే ఎలా ఈ ఉడుకూ ఈ దుడుకూ
ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు
ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద ఊఁ
ముసుగు వెయ్యద్దు వలలు వెయ్యద్దు ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో... కొంతకాలం
నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా కోటలైనా కొంపలైనా ఏవీ స్ధిరాస్ధి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ
పటంలో లేదుగా నిన్న లేవైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ ఉన్నకొన్నాళ్ళు గుండెనిండా
సరదాలు పండించనీ నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలసినడుద్దాం సావాసం సంతోషం
ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో ఎవడి
ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా మనసు చెప్పిందె
మనకు వేదం కాదనే వారె లేరురా మనకి తోచిందే చేసి చూద్దాం
ఎవరు ఏమంటె ఏంటిరా ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు
వయసు మీద