Album: Nee Andam Hampi
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra, M. M. Keeravani
Music: M. M. Keeravani
Lyrics: Vennelakanti
Label: Aananda Audio Video
Released: 1995-02-09
Duration: 04:17
Downloads: 1631
నీ అందం నా ప్రేమ గీత గోవిందం నీ వర్ణం నా
కీరవాణి సంకేతం నీ రాగం ఏ ప్రేమ వీణ సంకేతం ఈ
యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార
దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నా లేత
ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ
యోగం ఏ జీవధార సంయోగం జీరాడు కుచ్చిళ్ళ, పారాడు పాదాల
పారాణి వేదాలు గమకించగా కోరాడు మీసాల, తారాడు మోసాల నా మందహాసాలు
చమకించగా ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎద జంట తాళాలు వినిపించగా
ఆషాఢ మేఘాల ఆవేశగీతాలు సరికొత్త భావాలు సవరించగా నీకోసమే ఈడూ నేనూ
వేచాములే నీకోసమే నాలో నన్నే దాచానులే నిను పిలిచాను మలిసందె పేరంటం
ఇక మొదలాయె పొదరింటి పోరాటం ఆరాటం నీ అందం నా ప్రేమ
గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం హంసల్లె
వచ్చింది హింసల్లె గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా మాటల్లె
వచ్చింది మనసేదో విప్పింది వద్దన్న నీ మాట వలపించగా రెప్పల్లోకొచ్చింది రేపల్లె
కాళింది నా నువ్వు నీ నేను క్రీడించగా గాథల్లో నిదరోయి రాధమ్మ
లేచింది నా వేణువే నాకు వినిపించగా నీ పించమే కిలకించిపాలు చేసిందిలే
నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే మన హృదయాలలో ప్రేమ తారంగం
స్వర బృందావిహారాల చిందేటి ఆనందం నీ రాగం ఏ ప్రేమ వీణ
సంకేతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం గాంధార
శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం
నా లేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీత
గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం