Album: Prema Yatralaku
Music: Ghantasala, P. Susheela
Lyrics: Pingali Nagendra Rao
Label: Saregama
Released: 1962-12-31
Duration: 03:23
Downloads: 3397999
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము
యేలనొ అహహ అహహ కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో ప్రేమించిన
పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో అహహ అహహ ప్రేమించిన పతి
ఎదుటనుండగా వేరే దైవము యేలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో చెలి
నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా అహహ అహహ అహహ ఆహహహ
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖి నెరిచూపుల చల్లదనంతొ
జగమునె ఊటి శాయగా అహహ అహహ సఖి నెరిచూపుల చల్లదనంతొ జగమునె
ఊటి శాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో కన్నవారినే మరువజేయుచూ
అన్ని ముచ్చటలు తీర్చగా అహహ అహహ అహహహ ఆహహహ కన్నవారినే మరువజేయుచూ
అన్ని ముచ్చటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
అహహ అహహ పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో