Album: Aakasam Sakshiga
Singer: Sonu Nigam, Mahalakshmi Iyer
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 05:49
Downloads: 704124
ఆకాశం సాక్షిగా భూలోకం సాక్షిగా ఆకాశం సాక్షిగా భూలోకం సాక్షిగా
నిజం చెప్పనీ నిను ప్రేమించానని నిజం చెప్పనీ నిను పూజించానని
నిరూపించుకోనీ నీ ప్రేమే నా ప్రాణమని నివేదించుకోనీ నీ ప్రేమకి నా
హృదయాన్ని నిను స్వాగతించు బిగికౌగిలింతనై కాస్తా కంచెగా నీ చెలిమి నన్ను
శ్రీరామరక్షగా పరిపాలించగా నా శ్వాసే సాక్షిగా నీ ధ్యాసే సాక్షిగా
నిజం చెప్పనీ నిను ప్రేమించానని నిజం చెప్పనీ నిను పూజించానని
కొమ్మపైన ఆ చిలక ఊసులేమి చెప్పింది బొమ్మలాగ ఈ చిలక పరవశించి
విన్నది పంజరాన చెర కన్నా పర్ణశాల మేలంది రాముడున్న వనమైనా రాణివాసమన్నది
అన్నా అనుకున్నా అడవి అంతఃపురమవునా అయినా ఎవరైనా ఇది కొనగల వరమేనా
నిరూపించుకోనీ నీ ప్రేమే నా ప్రాణమని నివేదించుకోనీ నీ ప్రేమకి
నా హృదయాన్ని నిను స్వాగతించు బిగికౌగిలింతనై కాస్తా కంచెగా నీ చెలిమి
నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా ప్రతి నిమిషం సాక్షిగా మన పయనం
సాక్షిగా నిజం చెప్పనీ నిను ప్రేమించానని నిజం చెప్పనీ నిను పూజించానని
సప్తపదిగ సాగమని ప్రేమ నడుపుతున్నదట ఏరికోరి ఇద్దరినీ ఎందుకల్లుకుందట నిన్ను
నన్ను నమ్ముకునే ప్రేమనేది ఉన్నదట నీవు నేను కలవనిదే తనకి ఉనికి
లేదట ప్రణయం ఇకనుంచి మనజతలో బతకాలి నిత్యం వికసించే మధులతగా ఎదగాలి
నివేదించుకోనీ నీ ప్రేమకి నా హృదయాన్ని నిరూపించుకోనీ నీ ప్రేమే
నా ప్రాణమని నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా నిను స్వాగతించు
బిగికౌగిలింతనై కాస్తా కంచెగా రవి కిరణం సాక్షిగా తడి నయనం
సాక్షిగా నిజం చెప్పనీ నిను పూజించానని నిజం చెప్పనీ నిను ప్రేమించానని