Album: Alloneredu Kalla
Singer: K. S. Chithra, Parthasarathy
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:38
Downloads: 38734489
అల్లో నేరేడు కళ్లదాన ప్రేమ వల్లో పడ్డానే పిల్లదానా Hello, వర్ణాల
పూలవాన నిన్ను జళ్లో చుట్టేసి దాచుకోనా నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ
నామీదేనా కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్లో లేనా అల్లో
నేరేడు కళ్ల దాన ప్రేమ వల్లో పడ్డానే పిల్లదానా Hello, వర్ణాల
పూలవాన నిన్ను జళ్లో చుట్టేసి దాచుకోనా దాయీ దాయీ అనగానే
చేతికందేనా చంద్రవదనా కుంచై నువ్వే తాకగానే పంచప్రాణాలు పొందినానా బొమ్మో గుమ్మో
తేలక మారిపోయా నేనే బొమ్మగా ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే
చెలిగా రెప్ప మూసినా తప్పుకోనని కంటిపాప ఇంటిలోన ఏరికోరి చేరుకున్న దీపమా
అల్లో నేరేడు కళ్లదాన ప్రేమ వల్లో పడ్డానే పిల్లదానా Hello,
వర్ణాల పూలవాన నిన్ను జళ్లో చుట్టేసి దాచుకోనా అన్నెం పున్నెం
లేని వాడని అనుకున్నాను ఇన్ని నాళ్లు అభం శుభం లేని వాడిని
అల్లుకున్నాయి కన్నె కళ్లు మైకం పెంచే మాయతో మూగ సైగే చేసే
దాహమా మౌనం మీటే లీలతో తేనె రాగం నేర్పే స్నేహమా ఒంటరైన
నా గుండె గూటిలో సంకురాత్రి పండగంటి సందడల్లే చేరుకున్న రూపమా
అల్లో నేరేడు కళ్లదాన ప్రేమ వల్లో పడ్డానే పిల్లదానా Hello, వర్ణాల
పూలవాన నిన్ను జళ్లో చుట్టేసి దాచుకోనా నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ
నామీదేనా కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్లో లేనా