Album: Andalalo
Singer: S.P. Balasubrahmanyam, S. Janaki
Music: Ilaiyaraaja
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 2019-05-18
Duration: 05:01
Downloads: 5003665
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో
నింగీ నేలా చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే అందాలలో
అహో మహోదయం నా చూపుకే శుభోదయం లతా లతా సరాగమాడె
సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో మిల మిల హిమాలే
జల జల ముత్యాలుగా తళా తళా గళాన తటిల్లతా హారాలుగా చేతులు
తాకిన కొండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో అందాలలో అహో
మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా
చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే అందాలలో అహో మహోదయం నా
చూపుకే శుభోదయం సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక
సుగంధమేదో మనస్సునే హరించగా మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా విహారినై
ఇవాళే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే
క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగివచ్చే
లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందాలలో
అహో మహోదయం భూలోకమే నవోదయం