Album: Are Emaindhi
Singer: S. P. Balasubrahmanyam, S. Janaki
Music: Ilaiyaraaja
Lyrics: Acharya Atre
Label: Aditya Music
Released: 2018-03-23
Duration: 04:32
Downloads: 4069435
అరే ఏమైందీ అరే ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో
ఎగిరిందీ అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ కలగాని
కల ఏదో కళ్ళెదుటే నిలిచిందీ అది నీలో మమతను నిద్దుర లేపిందీ
అరే ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ అది ఏమైందీ
నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది నేలపొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలునేను చూడలేను పూజలేవి చేయలేను నేలపైన కాళ్ళులేవు నింగివైపు చూపులేదు కన్నెపిల్ల
కళ్ళలోకి ఎన్నడైన చూశావో కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావో
లలలల లా లలలల లా లలలల లా లలలల లా
లలలల లా లల లల లల లల లల లలలా
బీడులోన వానచినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతుతానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు
రాయగలవు రాతరాని వాడిరాత దేవుడేమి రాశాడో చేతనైతే మార్చిచూడు వీడు మారిపోతాడు
మనిషౌతాడు అరే ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ అది
ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ కలగాని కల ఏదో
కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దుర లేపింది అరే
ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ అది ఏమైందీ