Album: Chesededo
Singer: Rahul Nambiar, Revanth
Music: Mickey J Meyer
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2014-12-03
Duration: 04:25
Downloads: 1048531
చేసేదేదో చేసేముందే ఆలోచిస్తే తప్పుందా తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా ఆచి
తూచి అడుగెయ్యొద్దా ఈతే తెలియాలి నది ఎదురైతే పూర్తయి తీరాలి
కథ మొదలెడితే గెలుపే పొందాలి తగువుకి దిగితే పడినా లేవాలి ఏ
పూటైనా ఏ చోటైనా నిలవని పయనం సాగాలి రాళ్ళే ఉన్నా ముళ్ళే
ఉన్నా దారేదైనా గాని కోరే గమ్యం చూపించాలి పక్క పక్కనే అక్షరాలను
నిలిపివుంచినా అర్ధముండ ఓ పదము కానిదే అర్ధముండునా నీది అయిన నిర్వచనమిచ్చుకో
జీవితానికి ఏం చేసినా స్పష్టంగా పోల్చుకో శక్తుందా తేల్చుకో అతి
సులువుగా అయ్యే పనా ఏమనుకున్నా ఓహో కష్టాలే ఓర్చుకో ఇష్టంగా మార్చుకో
అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా ఒహో కలలకి, కళ్ళకి మధ్యన కనురెప్పే
అడ్డని నమ్మకం నిజమయే లోపుగా తప్పని నొప్పి ఉందని ఆటనే వేటగా
మార్చడం కాలం అలవాటని గమనించే తెలివుంటే ప్రళయాన్నే ప్రణయం అనవా పక్క
పక్కనే అక్షరాలను నిలిపివుంచినా అర్ధముండ ఓ పదము కానిదే అర్ధముండునా నీది
అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా శ్రీరాముని బాణమై సాధించిన
శౌర్యమే ఛేదించదా నీ లక్ష్యము యముడెదురైనా ఓహో కృష్ణుని సారధ్యమై సాగిన
సామర్ధ్యమే సాధించదా ఘనవిజయము ప్రతి సమరానా ఓహో కయ్యమో నెయ్యమో చెయ్యకు
కాలక్షేపానికి గాలిలో కత్తులే దుయ్యకు శత్రువు లేని దాడికి ఊహతో నిచ్చెనే
వెయ్యకు అందని గగనానికి వ్యర్ధంగా వదిలేస్తే వందేళ్ళు ఎందుకు మనకి పక్క
పక్కనే అక్షరాలను నిలిపివుంచినా అర్ధముండ ఓ పదము కానిదే అర్ధముండునా నీది
అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా