Album: Chowdari Garu
Singer: Vandemataram Srinivas
Music: Vandemataram Srinivas
Lyrics: Gandavarapu Dubbaro
Label: Aditya Music
Released:
Duration: 05:22
Downloads: 821490
అ చౌదరి గారు, ఓ నాయుడు గారు రెడ్డీ గారు, ఓ
రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు
చివరనే మా పాకలెందుకు (చౌదరి గారు, ఓ నాయుడు గారు
రెడ్డీ గారు, ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ
తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు) Donationల యుగములోన
డబ్బు లేని దళితుల్లో వందకొకడు చదువుతుంటే ఓర్చుకోని గుణమెందుకు (ఓర్చుకోని గుణమెందుకు)
అరె లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో వెయ్యికోకడు నౌకరైతే ఎడ్చుకొనే బుద్ధేందుకు
(ఎడ్చుకొనే బుద్ధేందుకు) పాయసాల జీడిపప్పు తినేవాళ్లకి సామీ (పాయసాల జీడిపప్పు తినేవాళ్లకి)
మా గంజిలోన ఉప్పుజూసి గొణుగుడెందుకూ చౌదరి గారు, ఓ నాయుడు
గారు రెడ్డీ గారు, ఓ రాజు గారు మీ పేరు చివరలో
ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు పల్లెటూళ్ల
సర్పంచుల పట్టణాల Chairmanల సగం నీకే ఇస్తమని సంకలెగర వెయ్యమన్రు (సంకలెగర
వెయ్యమన్రు) శాసనసభ సభ్యుల్లో Parliament-u Memberలు అర కోర Seat-uలిచ్చి Ice-u
జేసి పోతన్రు (Ice-u జేసి పోతున్రు) Power-u లేని పడవికుండె Reservation-u
(Power-u లేని పడవికుండె Reservation-u) ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు గా
ముఖ్యమంత్రి పడవికైన ఎందుకుండదు సామీ (చౌదరి గారు ఓ నాయుడు
గారు రెడ్డీ గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో
ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు) పండుతున్న
భూముల్లో ఎనభై శాతం మీవే Millల్లో మిషనుల్లో మూడొంతులు మీ కిందే
(మూడొంతులు మీ కిందే) అరె రూపాయ కట్టలన్ని మీ ఇనప పెట్టెలందే
బంగారం వెండంత మీ మెడకే మీ కాళ్లకే (మీ మెడకే మీ
కాళ్లకే) ఎనభై శాతం మంది ఎండుకొని చస్తుంటే ఇరవై శాతం మీరు
దండుకొని బతుకుతున్రు (దండుకొని బతుకుతున్రు) మా చదువులు మా కొలువులు మీకు
ఇస్తము (మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము) మీ సంపదలో
Reservation మాకు ఇస్తరా (చౌదరి గారు, ఓ నాయుడు గారు
రెడ్డీ గారు, ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ
తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు) మీ అబ్బ
పేరేమో సుబ్బారావు గారైతే మా అయ్యా పేరేమో సుబ్బిగాడు ఐపోయే (సుబ్బిగాడు
ఐపోయే) మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే మా తమ్ముడు గాడేమో
రిక్షాలు తొక్కుతుండె (రిక్షాలు తొక్కుతుండె) మీ అమ్మకు జలుబొస్తే అపొలోలో జేరుతుంటే
మా తల్లికి కేన్సరైతే ఆకు పసరు మింగుతుండే (ఆకు పసరు మింగుతుండే)
మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే (మా బాధలు మా
గాధలు దేవుళ్ళకి చెబుదమంటే) దేవుళ్లలో ఒకడైన దళితుడే లేకపాయే చౌదరి
గారు, ఓ నాయుడు గారు ఆ రెడ్డీ గారు, ఓ రాజు
గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే
మా పాకలెందుకు (చౌదరి గారు, ఓ నాయుడు గారు రెడ్డీ
గారు, ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు మీ పేరు చివరలో ఆ
తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు)