Album: Ee Rojaithey Chusanu
Singer: Shashi Preetam
Music: Shashi Preetam
Lyrics: Kona Venkat
Label: Aditya Music
Released: 1995-02-19
Duration: 04:37
Downloads: 841503
ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను
ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను కాలం
కాదన్నా, ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచే
గుండెల్లో నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే నీ నీడై
వస్తాను ఎటు వైపున్నా నీ కష్టంలో నేనూ ఉన్నాను కరిగే
నీ కన్నీరవుతా నేను చెంపల్లో జారి, నీ గుండెల్లో చేరి నీ
ఏకాంతంలో ఓదార్పవుతాను కాలం ఏదో గాయం చేసింది నిన్నే మాయం
చేశానంటోంది లోకం నమ్మి అయ్యో అంటోంది శోకం కమ్మి జోకొడతా ఉంది
గాయం కోస్తున్నా, నే జీవించే ఉన్నా ఆ జీవం నీవని సాక్ష్యం
ఇస్తున్నా నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోగే గుండెల
సవ్వడిలే అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగ నువ్ లేకుంటే నేనంటూ ఉండనుగా
నీ కష్టంలో నేనూ ఉన్నాను కరిగే నీ కన్నీరవుతా నేను
చెంపల్లో జారి, నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పవుతాను
ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను కాలం
కాదన్నా, ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను