Album: Endhukuley Ila
Singer: R.P. Patnaik
Music: R.P. Patnaik
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 03:54
Downloads: 3080674
ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల అన్ని
వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతు వేధించాలా మంటై నను
సాధించాలా కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా మరుపన్నదే రానియ్యవా దయలేని స్నేహమా
ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల అన్ని
వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా తప్పదనీ నిను తప్పుకొని
వెతకాలి కొత్త దారి నిప్పులతో మది నింపుకొని బతకాలి బాటసారి జంటగా
చితిమంటగా గతమంత వెంట ఉందిగా ఒంటిగా నన్నెన్నడూ వదిలుండనందిగా నువ్వూ నీ
చిరునవ్వూ చేరని చోటే కావాలి ఉందో లేదో ఈ లోకంలో నీకే
తెలియాలి ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని
కల అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా ఆపకిలా
ఆనాటి కల అడుగడుగు తూలిపోదా రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు
చూడనీక జన్మలో నువ్వులేవని ఇకనైన నన్ను నమ్మనీ నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ
ఆశని చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా నన్నే నేనూ
వెళివేసుకొనీ దూరం అవుతున్నా ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట
రేపుతావు అందని కల అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా