Album: Gundeleni Bandarayive O Pilla
Singer: NAVA SANDEEP
Music: Udhay Kiran
Lyrics: NAVA SANDEEP
Label: Sarigama Audios & Videos
Released: 2021-05-17
Duration: 05:19
Downloads: 1224803
గుండెలేని బండరాయివే ఓ పిల్లా మనసులేని మాయ బొమ్మవే నన్నెంత మోసం
చేస్తివే పిల్లా నరకానికే నన్ను తోస్తివే జాలిలేని కీలు మనిషివే పిల్లా
ప్రేమలేని నీటి చమ్మవే నా కంటిలోన నలుసువైతివే పిల్లా కనుపాపనే పొడిచి
పోతివే నా ప్రాణము నా ద్యానము నువ్వేలే అనుకున్నా నా సర్వము
నా స్వర్గము నువ్వేనని కలగన్నా ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇది
ఈ జన్మలో నన్నిలాగ వేదిస్తున్నది ఏ దేవుడో కక్షబూని రాసిన రాతిది
ఈనాడిలా శిక్షలేసి చంపుతున్నది గుండెలేని ఓ గుండెలేని గుండెలేని బండరాయివే పిల్లా
మనసులేని మాయ బొమ్మవే నన్నెంత మోసం చేస్తివే పిల్లా నరకానికే నన్ను
తోస్తివే ఏ తోడు లేకున్నా నాతోడు నువ్వంటూ నీ వేలు
పట్టుకొని నీ వెనకే నడిచాను ఏ నీడలేకున్నా నానీడ నువ్వంటూ నీ
అడుగులో అడుగేసి నీ వెనకే తిరిగాను లాలి పాటలు పాడి చంటిపాపలాగా
చూసుకుంటా నిన్ను ఆనాడు నీ జ్ఞాపకాలని నీ తీపిగుర్తుల్ని మరువనే ఓ
పిల్లా ఏనాడూ నా గుండెనే చిన్ని గుడిలాగ మార్చేసి ఎదురు చూస్తున్నానే
నీకోసం నిండు పున్నమిలోన పండు వెన్నెలలాగా ఒక్కసారి రావా నాకోసం చిన్నారి
పొన్నారి చిలకమ్మా ఎందుకే నీకు నాపైన కోపం నామీద శాపం నేనేమి
చేశానే అంత పాపం బంగారు రంగుల కోయిలమ్మా ఎందుకే నాకు వేసావు
భారం మిగిలింది శోకం నాపైన మోపావు ఇంత నేరం ఓ ప్రేమా
నన్ను నరకంలో పడవేసి వెళ్లిపోతావా ఓ ప్రేమా నన్ను అగ్నికి ఆహుతిని
చేసి ఆటాడుకుంటావా గుండెలేని ఓ గుండెలేని గుండెలేని బండరాయివే పిల్లా మనసులేని
మాయ బొమ్మవే నన్నెంత మోసం చేస్తివే పిల్లా నరకానికే నన్ను తోస్తివే
జాలిలేని కీలు మనిషివే పిల్లా ప్రేమలేని నీటి చమ్మవే నా కంటిలోన
నలుసువైతివే పిల్లా కనుపాపనే పొడిచి పోతివే నాలోని ఊపిరంతా నీలోనే
దాచాను ప్రాణాలు మిగిలివున్న దేహంలా నిలిచాను ఈ జన్మ నీ ప్రేమకు
అంకితమే ఇచ్చాను ఏడేడు జన్మలైనా నీతోనే ఉంటాను నింగిలోని తార నెలపైన
వాలి గాలిలాగ నన్ను తాకింది కళ్లు మూసి తెరిచి చూడబోయేలోపు మాయలాగ
వెళ్ళిపోయింది గూటిలోని గువ్వ చెలిమి చేయ్యమంటూ కొంటెగానే నన్నుకోరింది ఆశల తీరాన్ని
అందుకునేలోపు కుంటి సాకు చెప్పి పోయింది రాగాలు పలికేటి వేణువమ్మా ఎందుకే
నాకు చేసావు గాయం విసిరావు గాలం నేనేమి చేసానే అంత ఘోరం
మాటలు నేర్చిన మల్లికొమ్మా ఎందుకే నాపై చల్లావు కారం పోతుంది ప్రాణం
ఇకనైనా ఆపమ్మా నీ నాటకం ఓ ప్రేమా నీ మారణాయుదాలకు
నను బలిచేసి పోతావా ఓ ప్రేమా నను కన్నీటి సంద్రంలో ముంచేసి
పోతావా గుండెలేని ఓ గుండెలేని