Album: NALLA MABBULLONA
Singer: NAVA SANDEEP
Music: VENKAT AJMEER
Lyrics: NAVA SANDEEP
Label: Sarigama Audios & Videos
Released: 2021-01-07
Duration: 05:28
Downloads: 2550723
మరిచే పోయావా నువ్వు మారిపోయావా ఒంటరి చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా
మరిచే పోయావా నువ్వు మారిపోయావా ఒంటరి చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా
ఎవ్వరు లేని ఏకాకిలాగా మిగిలానే ఓ పిల్లా అందమైన నా
జీవితమంతా ఆగమైందే నీ వల్ల గుండెను పొడిచేటి ముళ్ల పొదలో నేను
చిక్కుకున్నానే ఓ పిల్లా జన్మలోన లేని దుఃఖమంతా నన్ను బాధ పెడుతూ
ఉందే ఈ వేళా ఉలుకు లేని పలుకు లేని మూగవాడినే నీ
ప్రేమలోనే మునిగి నేను మోసపోతినే కనులు రెండు ఉన్నా నేను గుడ్డివాడినే
నీ మనసులోని విషాన్ని చూడలేకపోతినే మరిచే పోయావా నువ్వు మారిపోయావా ఒంటరి
చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా నీ వేలు పట్టుకొని రేయంతా
పగలంతా అరికాలు అరిగేలా వెనకే తిరిగానే నీ నీడ చూసుకొని ఇలలోన
కలలోన నా తోడు నువ్వంటూ ఎంతో మురిసానే నన్నేమిచేసావు ఏ చోట
నేనున్నా నీ జ్ఞాపకాలే మనసంతా కన్నీటి సంద్రంలో కరిగిపోతూవున్నా కనికరించరాదే కూసంత
నల్ల మబ్బులోన తెల్లంగా మెరిసేటి సందామామ నా గొంతుకు బిగిసిన ఉరితాడునే
తెంపి వెళ్లిపోవమ్మా సెట్టు కొమ్మలల్లో గువ్వను కూసేటి కోయిలమ్మ నా గుటిలోకి
చేరి ఓ ప్రేమ పాటను పాడవేలమ్మా రావే రావే పిల్లా
నువ్వు రావే రావే పిల్లా రావే రావే పిల్లా నువ్వు రావే
రావే పిల్లా రావాలనే ఆశ ఉంటే రాకపోదువా నువ్వు చేరాలన్న కోరిక
ఉంటే చేరలేకపోదువా మరిచే పోయావా నువ్వు మారిపోయావా ఒంటరి చేసావా నన్ను
వదిలేసి వెళ్ళావా నాలోని ప్రాణమంతా నీలోనే దాచాను నీతోనే ఉన్నాను
నిన్నే విడలేక నాలోని ఊపిరంతా నీకే అర్పించాను నీ కొరకై ఏడ్చాను
నువ్వే జతలేక నేనున్నా లేకున్నా ఏ చోట నువ్వున్నా నీ సంతోషాన్నే
కోరుతున్నా నా మీద నీకైనా ఏ ప్రేమ లేకున్నా నీ రాకకై
నే వేచి ఉన్నా కొండ కోనల్లోన హాయిగా తిరిగేటి రామచిలుకమ్మ నీలాంటి
బతుకున్న నాకింక శోకము లేకపోనమ్మ గాయాల పాలైన రాగాన్ని పలికించే వేణువువమ్మా
నా గుండెకు తగిలిన గాయానికే మందు చెప్పిపోవమ్మా రావే రావే
పిల్లా నువ్వు రావే రావే పిల్లా రావే రావే పిల్లా నువ్వు
రావే రావే పిల్లా రావాలనే ఆశ ఉంటే రాకపోదువా నువు చేరాలంటే
కోరిక ఉంటే చేరలేకపోదువా మరిచే పోయావా నువ్వు మారిపోయావా ఒంటరి చేసావా
నన్ను వదిలేసి వెళ్ళావా