Album: Gunna Maamidi Balamithrula Katha
Singer: Rajan-Nagendra
Music: Rajan-Nagendra
Label: Saregama
Released: 2008-09-30
Duration: 04:34
Downloads: 30522
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక
గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది చిలకేమో పచ్చనిది
కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది చిలకేమో
పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే పొద్దున చిలకను చూడందే
ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే చివురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు
కొమ్మ ఊయల గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక పలుకే
పలుకుతాయి... ఒక జట్టుగ తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి ఒక
పలుకే పలుకుతాయి... ఒక జట్టుగ తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా రంగు రూపు వేరైనా
తమ జాతి రీతి ఏదైనా చిలకా కోయిల చేసిన చెలిమి ముందు
తరాలకు తరగని కలిమి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక
గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది