Album: Jatha Kalise
Singer: Sagar, Suchitra
Music: Devi Sri Prasad
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2015-08-07
Duration: 03:44
Downloads: 8871698
జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత
కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు
వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుగుద్దినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరూ ఏ
కన్ను ఎపుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు
నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలు తలపు లోతున ఆడమగలని గురుతులేని
పసివాళ్ళు మాటలాడుకోకున్నా మది తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు
ప్రాణాలు పేరుకేమో వేరువేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు ఏ కన్ను
ఎపుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు ఉన్న
చోటు వదిలేసి ఎగిరిపోయె నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు
ఏకాంతమివ్వడం కోసం నీలిరంగు తెర తీసి తొంగిచూసె ఆకాశం చూడకుండ ఈ
అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని
సంబరాన తేలినారు నేడిలా ఇపుడే కలిసి అప్పుడే వీరు ఎపుడో కలిసినవారయ్యారు
ఏ కన్ను ఎపుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు