Album: Jevana Vahini
Singer: Kalpana, Ganga, M. M. Keeravani
Music: M. M. Keeravani
Lyrics: Veturi
Label: Aditya Music
Released: 2003-02-16
Duration: 05:58
Downloads: 948384
ఓం ఓం ఓం జీవన వాహినీ... పావనీ కలియుగమున కల్పతరువు
నీడ నీవనీ కనులు తుడుచు కామధేను తోడు నీవని వరములిచ్చి భయము
తీర్చి శుభము గూర్చు గంగాదేవి నిను కొలిచిన చాలునమ్మా సకల లోక
పావని భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరిగు శుభగాత్రీ గంగోత్రి
గంగోత్రి గంగోత్రి గంగోత్రి (గల గల గల గంగోత్రి హిమగిరి
దరి హరి పుత్రి గల గల గల గంగోత్రి హిమగిరి దరి
హరి పుత్రి) జీవన వాహినీ (గల గల గల గంగోత్రి హిమగిరి
దరి హరి పుత్రి) (గల గల గల గంగోత్రి హిమగిరి దరి
హరి పుత్రి) పావనీ (గల గల గల గంగోత్రి హిమగిరి దరి
హరి పుత్రి) మంచుకొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజా
వాహినీ సససరిసరి గరిగమగమ దప దప దప దప గరి సరి
సరి సరి విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సుర
గంగ నీవనీ సానిదగరిసనిదపమగరి సరి సరి గమ గమ గరిస అత్తింటికి
సిరుల నొసగు అలకనందవై సగర కులము కాపాడిన భాగీరధీవై బదరీవన హృషికేశ
హరిద్వార ప్రయాగముల మణి కర్ణిక తన లోపల వెలసిన శ్రీ వారణాసి
గంగోత్రి గంగోత్రి గంగోత్రి గంగోత్రి (గల గల గల గంగోత్రి
హిమగిరి దరి హరిపుత్రి గల గల గల గంగోత్రి హిమగిరి దరి
హరిపుత్రి గల గల గల గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి గల
గల గల గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి) పసుపు కుంకుమతో
పాలు పన్నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం అమ్మా, గంగమ్మా కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం
కలిగించొద్దని యమునకు చెప్పామ్మా సాయమునకు వెనకాడొద్దనీ గోదారికీ కావేరీకి ఏటికి సెలయేటికి
కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీ తోబుట్టువులందరికీ చెప్పమ్మా మా గంగమ్మా
జీవ నదివిగా ఒక మోక్ష నిధివిగా పండ్లు పూలు పసుపులా పారాణి
రాణిగా శివుని జటలనే తన నాట్య జతులుగా జలక మాడు
సతులకు సౌభాగ్య దాత్రిగా గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని
మూడు మునకలే చాలుగా జలదీవెన తలకుపోసే జననీ గంగాభవాని ఆమె అండ
మంచు కొండ వాడని సిగ పూదండ గంగోత్రి గంగోత్రి గంగోత్రి గంగోత్రి
(గల గల గల గంగోత్రి హిమగిరి దరి హరి పుత్రి
గల గల గల గంగోత్రి హిమగిరి దరి హరి పుత్రి) జీవన
వాహినీ (గల గల గల గంగోత్రి హిమగిరి దరి హరి పుత్రి)
(గల గల గల గంగోత్రి హిమగిరి దరి హరి పుత్రి) పావనీ
(గల గల గల గంగోత్రి హిమగిరి దరి హరి పుత్రి) (గల
గల గల గంగోత్రి హిమగిరి దరి హరి పుత్రి గల గల
గల గంగోత్రి హిమగిరి దరి హరి పుత్రి గల గల గల
గంగోత్రి హిమగిరి దరి హరి పుత్రి)