Album: Alanati Ramachandrudu
Singer: Jikki, Sunitha, Sandhya
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 05:21
Downloads: 10579785
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అలనాటి
రామచంద్రుడికన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన
అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి
దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి
దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామా చందమామా
కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా
వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడిబొమ్మకు పుస్తెలు
కడుతూ పురుషుడి మునివేళ్లు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపిన
తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని
కళగల జంటని పదిమంది చూడంది తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల
అక్షితలేయండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజును
చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా
లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని
విల్లు ఈ పెళ్లి మండపాన గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని
ఒళ్లు ఈ చల్లని సమయాన దేవుళ్ల పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా
జరిగేనా దేవుళ్ల పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని
ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజును చూసి
నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని
వెలవెలబోవమ్మా