Album: Kannula Baasalu
Singer: Karthik
Music: Yuvan Shankar Raja
Lyrics: Shiva Ganesh
Label: Aditya Music
Released: 2004-06-24
Duration: 05:49
Downloads: 9095453
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి, మరువైపు
దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే ఇది అద్దాల
మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే గాలి వీచి, ఆకు రాలిన
కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే ఒకపరి
మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే అనుదినమూ ఇక తపియించే
యువకుల మనసులు తెలియవులే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు
ఎరుగవులే ఒకవైపు చూపి, మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు
సంద్రాన్ని మోయలేవులే అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే కన్నుల అనుమతి
పొంది ప్రేమ చెంతకు చేరదులే దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే
మెరుపులా వెలుగును పట్టగ మిణుగురు పురగుకి తెలియదులే కళ్లు నీకు సొంతమట
కడగళ్లు నాకు సొంతమట అల కడలి దాటగనే నురుగులిక ఒడ్డుకు సొంతమట
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి,
మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
లోకాన పడుచులు ఎందరున్ననూ మనసొకరిని మాత్రమే వరియించులే ఒకపరి దీవించ ఆశించగా
అది ప్రాణంతోనే ఆటాడులే మంచుబిందువొచ్చి ఢీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే అరె, చీరను కట్టి స్త్రీ ఆయెలే ఉప్పెనొచ్చిన,
కొండ మిగులును చెట్లు, చామలు మాయమవునులే నవ్వు వచ్చులే, ఏడుపొచ్చులే ప్రేమలో
రెండూ కలిసే వచ్చులే ఒకపరి మగువా చూడగనే కలిగే వ్యధ తను
ఎరుగదులే అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే కన్నుల
బాసలు ఏ కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు
చూపి, మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి, ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్ని తిన్నగాని
మనసు మాత్రం మారదులే