Album: Ko Ko Ku Kokilama
Singer: K.J. Yesudas, K. S. Chithra
Music: Vandemataram Srinivas
Lyrics: Guru Charan
Label: Aditya Music
Released: 2019-07-16
Duration: 04:54
Downloads: 638206
కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా
గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక గూటిలోని చోటే నీదమ్మా
ఏ మనసు తొలిసారి కలిసిందో ఎవరంటే తెలిసిందో ఇది ప్రేమది ఏ
జంట మలిసారి వలచిందో బదులిమ్మని అడిగిందో ఆ ప్రేమని వీచే గాలి
చల్లదనాలు దీవెనలేనంటా పూచే పువ్వై నిదురించేది నీ ఒడిలోనంటా కు కు
కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా ఆరు
రుతువుల నింగి తోటలో తోటమాలికి ఈ తొందరెందుకో తొడునీడగా చేయి వీడక
బాటసారిని తీరాన చేర్చుకో నీలాల నింగి ఆ తారలన్ని ఏ ప్రేమ
చేసిన చిరు సంతకం జతగా ఓ ప్రేమ కథగా ఎన్నేళ్ల కైనా
ఉందాములే ఎన్నో జన్మల అనుబంధాలే హారతులవ్వాలి నవ్వే నువ్వై నువ్వే నేనై
ఒకటై పోవాలి కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన
కబురే తేవమ్మా గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక గూటిలోని
చోటే నీదమ్మా ఇంద్ర దనసులో ఏడు రంగులు పల్లవించని నీ
మేని సొంపులో తాజ్మహల్ లో ఉన్న వైభవం తొంగి చూడని తొలి
ప్రేమలేఖలు నీ మాటలన్ని నా పాటలైతే నిను దాచుకోన నా కవితగా
పలికే నా పాటలోన కలకాలముంటా నీ ప్రేమనై కలిసి ముందుకు సాగేటందుకు
అడుగులు కలపాలి ముద్దు ముచ్చట తీరేటందుకు ముడులను వేయాలి కు కు
కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా గు గు
గు గోరువంక ఇన్ని మాటలెందుకింక గూటిలోని చోటే నీదమ్మా