Album: Konta Kalam
Singer: Madhu Balakrishnan, Sujatha Mohan
Music: Vidyasagar
Lyrics: Vennelakanti
Label: Aditya Music
Released: 2005-09-27
Duration: 04:26
Downloads: 416755
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న
కాలం రేపు కూడ రావాలి కొంత కాలం కొంత కాలం కాలమాగి
పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి ఎంత
కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న
కాలం రేపు కూడ రావాలి గుండె విరహములో మండే వేసవిలో
నువ్వే శీతకాలం కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం
మదనుడికి పిలుపు మల్లె కాలం మదిలోనె నిలుపు ఎల్లకాలం చెలరేగు వలపు
చెలి కాలం కలనైన తెలుపు కలకాలం తొలి గిలి కాలం కౌగిలికాలం
మన కాలం ఇది ఆ కొంత కాలం కొంత కాలం కాలమాగి
పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి
కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాము కాలం గుచ్చే చూపులకు గిచ్చే
కైపులకు వచ్చే ప్రేమకాలం తమి తీరకుండు తడి కాలం క్షణమాగనంది ఒడి
కాలం కడిగింది సిగ్గు తొలికాలం మరిగింది మనసు మలి కాలం మరి
సిరికాలం మగసిరి కాలం మన కాలం పదా ఆ కొంత కాలం
కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు
కూడ రావాలి ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి అంత కాలమంత
కాలం ఈడు నిద్దరాపాలి