Album: Manasu Palike
Singer: S. P. Balasubrahmanyam, S. Janaki
Music: Ilaiyaraaja
Lyrics: Dr. C. Narayana Reddy
Label: Aditya Music
Released: 2000-01-01
Duration: 05:34
Downloads: 4294107
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మనసు
పలికే మనసు పలికే మౌనగీతం మౌనగీతం మనసు పలికే మౌన గీతం
నేడే మమతలొలికే మమతలొలికే స్వాతిముత్యం స్వాతిముత్యం మమతలొలికే స్వాతిముత్యం నీవే అణువు
అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు
ఉఁ మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతిముత్యం నీవే
శిరసుపైని గంగనై మరుల జలకాలాడనీ మరుల జలకాలాడనీ ఆ ఆ
ఆ సగము మేన గిరిజనై పగలు రేయి ఒదగనీ పగలు రేయీ
ఒదగనీ ఆఆ ఆ ఆ హృదయ మేళనలో మధుర లాలనలో హృదయ
మేళనలో మధుర లాలనలో వెలిగిపోనీ రాగ దీపం వెలిగిపోనీ రాగ దీపం
వేయి జన్మలుగా మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతిముత్యం
నీవే ఆ ఆ ఆ ఆ ఆ కానరాని ప్రేమకే
ఓనమాలు దిద్దనీ ఓనమాలు దిద్దనీ ఆఆ ఆ ఆ పెదవిపైని ముద్దునై
మొదటి తీపి అద్దనీ మొదటి తీపి ఓ లలిత యామినిలో కలల
కౌముదిలో లలిత యామినిలో కలల కౌముదిలో కరిగిపోని కాలమంతా కరిగిపోని కాలమంతా
కౌగిలింతలుగా మనసు పలికే మనసు పలికే మౌనగీతం మౌనగీతం మనసు
పలికే మౌన గీతం నేడే మమతలొలికే మమతలొలికే స్వాతిముత్యం స్వాతిముత్యం మమతలొలికే
స్వాతిముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ
మధువు తనువు సుమధనువు సాహిత్యం: సి. నారాయణరెడ్డి