Album: Naa Gundello
Singer: Yazin Nizar, Nikhita Gandhi
Music: Gopi Sunder
Lyrics: Rambabu Gosala
Label: Aditya Music
Released: 2019-03-08
Duration: 04:25
Downloads: 14324872
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా ఝల్లుమందే ఏమయ్యిందో నా ఊహల్లో నువ్వొచ్చి
వాలంగా ఇష్టంగుంది ఏమౌతుందో మదిలో మెదిలే మాటలనే పెదవే దాచనందే ఎదలో
ఎగసే అలజడినే అడగాలి మన కథే ఓ... నా గుండెల్లో ఉండుండి
మెల్లంగా ఝల్లుమందే ఏమయ్యిందో ఎలా అందిందే ఆకాశం అందేసిందే? ఎలా ఆనందం
పొంగిదే ఎలా అల్లిందే ఉల్లాసం అల్లేసిందే? ఎలా ఒళ్ళంతా తుళ్ళిందే?
ఇంచు మించుగా ఊపిరాగేట్టుందిలే నువ్వే చూసి చూడనట్టు వెళ్లకే కొంచెం కొంచెంగా
మౌనం కరిగేట్టుందిలే నువ్వే మంత్రం వేసి మనసే లాగితే మన మాటే...
పాటగా మారనీ మన పాటే... ప్రేమగా సాగనీ ఆ ప్రేమే స్వప్నమై
సత్యమై స్వర్గమైపోనీ... మన కలయికలో నా గుండెల్లో ఉండుండి మెల్లంగా ఝల్లుమందే
ఏమయ్యిందో మంచు పువ్వంటి చిన్ని నవ్వు నవ్వేస్తే పంచ ప్రాణాలన్నీ
మళ్ళీ పుట్టేలే పంచదారంటి తీపి ఊసులాడేస్తే లక్ష నిమిషాలైనా ఇట్టే గడిచేలే
సంద్రమైనా చిటికెలో దాటనా సందెపొద్దు జిలుగులో చేరెనా మధురం మధురం మధురం
మన ఈ ప్రేమం... సుమధుర కావ్యం నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
ఝల్లుమందే ఏమయ్యిందో నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా ఇష్టంగుంది ఏమౌతుందో మదిలో
మెదిలే మాటలనే పెదవే దాచనందే ఎదలో ఎగసే అలజడినే అడగాలి మన
కథే