Album: Naalo Nuvvuvoka Sagamai
Singer: KK, Singer Usha
Music: Ramana Gogula
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released: 2003-01-01
Duration: 04:05
Downloads: 1296834
నాలో నువ్వొక సగమై నేనొక సగమై చెరొక సగమై నిలిచే ఇలా
ఒకరికొకరై ఒకే ఒకరై చివరి వరకు కలిసే కలసిన మనసుల బంధం
పెళ్ళి కమనీయం ఈ పెళ్ళి ఒక మాటగా ఒక బాటగా ఒక
గూటికి పయనం పెళ్లి నాలో నువ్వొక సగమై నేనొక సగమై
చెరొక సగమై నిలిచే ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై చివరి వరకు
కలిసే ప్రతీ చూపు నీవైపే ప్రతీ అడుగు నీజతలోనే ప్రతీ
నవ్వు నీతోనే ప్రతీ జన్మ నీ వొడిలోనే బ్రతుకంత నీకే సొంతమే
చితికైన నీతో సిద్ధమే అని పలికిన మంత్రం పెళ్ళి అనురాగం వెదజల్లి
అక్షింతలే సాక్ష్యాలుగా వర్షించిన మేఘం పెళ్ళి నాలో నువ్వొక సగమై
నేనొక సగమై చెరొక సగమై నిలిచే ఇలా ఒకరికొకరై ఒకే ఒకరై
చివరి వరకు కలిసే నువ్వేనంట నా నేస్తం నువ్వేనంట నమ్మిన
దైవం నువ్వేనంట ఆధారం నువ్వేనంట ఆశల తీరం నాకంటే ఇష్టం నువ్వనీ
నీ కష్టం నష్టం నాదనీ వివరించిన సూత్రం పెళ్ళి విధికైనా ఎదురెళ్ళి
నా ప్రాణమే నీ ప్రాణమై వెలిగించే దీపం పెళ్ళి