Album: Nammavemo
Singer: Saketh
Music: Mani Sharma
Lyrics: Anantha Sriram
Label: Aditya Music
Released:
Duration: 04:47
Downloads: 25710037
నమ్మవేమోగాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది
నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది
అందుకే అమాంతం నా మది అక్కడే నిశ్శబ్దం అయినది ఎందుకో ప్రపంచం
అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో
మాయలో నన్నిలా ముంచివేసింది నవ్వులు వెండి బాణాలై నాటుకు పోతుంటే
చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే
రూపం ఈడు భారాలై ముందర నించుంటే ఆ సోయగాన్నే నే చూడగానే
ఓ రాయిలాగ అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు
తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది
వేసవి పాపం చలివేసి ఆమెని వేడింది శ్వాసలలోన తలదాచి జాలిగ కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే కలల తాకిడిని
మనసు తాళదిక వెతికి చూడు చెలిని నిజంగా కళ్ళతో వింతగా
మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది