Album: Nee Choopule
Singer: Haricharan, K. S. Chithra
Music: G.V. Prakash Kumar
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2018-12-20
Duration: 06:00
Downloads: 7421914
నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనై ఉన్నా
మరి అందించవే దీపావళి ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన
కలలా కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసీ చూడవెలా నయనం హృదయం
నీవే నీవై సమయం వెనుకే చేశా పయనం తదుపరి జన్మకైన జాలి
చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా రోజూ కొత్తగా నీ సందర్శనం
ఆహా అన్నది నాలో స్పందనం నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో
వింతగా ఉందీ అనుభవం నడివేసవిలో మరిగిస్తూనే మురిపిస్తోందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయింది ప్రేమ గుణం నీకై వేచే నిట్టూరుపులే
తూరుపు కానీ నీ తలపులలో తలమునకవనీ ఎన్నో జన్మలని నయనం హృదయం
నీవే నీవై సమయం వెనుకే చేశా పయనం తదుపరి జన్మకైన జాలి
చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే
నాకిలా చూపిందెవ్వరో నన్నీవైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో దరిదాపుల్లో పడిగాపుల్లో
పడి నిలిచా నీరెడారుల్లో తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనై ఉన్నా
మరి అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసీ చూడవెలా నయనం హృదయం నీవే
నీవై సమయం వెనుకే చేశా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే
వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా