Album: Nee Navvula
Singer: Mallikarjun, Sunitha Upadrasta
Music: Mani Sharma
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2017-09-13
Duration: 04:42
Downloads: 4199851
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ
పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ కోకను
సీతాకోక నీ పలుకులు చిలకల మూక నీ చూపును చంద్రలేఖ నీ
కొంగును ఏరువాక బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ అసలివ్వద్దూ ఇవ్వద్దూ
ఇవ్వద్దూ నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు నా వైపే
మొగ్గిన నీకైతే అది మొత్తం ఇవ్వచ్చు నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు
భాషకే ఇవ్వద్దు నాకోసం వేచిన నీకైతే అది రాశిగా ఇవ్వచ్చు భక్తి
శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
నీకై మొక్కే నాకే ఇవ్వచ్చు నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ
ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం
ఇవ్వద్దు మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగ ఇవ్వచ్చు నీ
భారం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వద్దు నీనంటే మెచ్చిన నీకైతే
అది వెంటనే ఇవ్వచ్చు నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా
ఇవ్వద్దు నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నీకై
బ్రతికే నాకే ఇవ్వచ్చు నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ
ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ
ఇవ్వద్దూ నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే
నా పాపిటి వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే ప్రాయం
ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా