Album: Nenusaitham
Singer: S.P. Balasubrahmanyam
Music: Mani Sharma
Lyrics: Suddala Ashok Teja
Label: Aditya Music
Released: 2018-08-16
Duration: 04:05
Downloads: 1971985
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి
ధారపోశాను నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను అగ్నినేత్ర మహోగ్రజ్వాల దాచినా ఓ రుద్రుడా అగ్నిశిఖలను
గుండెలోనా అణచినా ఓ సూర్యుడా హరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశవా హింసనణచగ
ధ్వంసరచనలు చేసినా ఆచార్యుడా మన్నెంవీరుడు రామరాజు ధను: శ్శంఖారానివా భగత్ సింగ్
కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం నీదిరా లంచగొండుల
గుండెలో నిదురించు సింహం నీవురా ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా సత్యమేవ జయతె కే నిలువెత్తు
సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను నేను సైతం
భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను