Album: Ney Veyrey Telugu
Singer: Karthik, Shreyas Puranik, Anantha Sriram
Music: Shreyas Puranik
Lyrics: Anantha Sriram
Label: T-Series
Released: 2023-10-27
Duration: 04:31
Downloads: 6381882
హో నా దేహమంతా నీ స్నేహంతో నిండింది చూడే నేస్తమా హో
నా మౌనమంతా నీ ధ్యానంలో మునిగింది చూడే ప్రాణమా నా
చిన్ననాటి నుండే నీ పేరే వినిపిస్తూ ఉందే నాకన్న నిన్ను ముందే
చదివేసి ఇటు చేరుకుందే నే వేరే, నువ్ వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా నే వేరే, నువ్ వేరే
కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా నీ
పాదం స్ప్రుశించాకే నే తాకానే నీ పెదవిని నీ ద్వేషాన్నే ముందుగా
కలిసి మళ్లీ చూస్తా నీ ప్రేమని కసురుల దాగిన కనికరమా అలకల
మాటున అనురాగమా శిశిరాల జాడిలా ఎదురైన మరల రాదా మరు క్షణాన
వాసంతమే నీ చేదు జ్ఞాపకాలే గాయాలుగా మార్చుకుంటా నువు నుంచుకున్న చోటే
నను నేను శిక్షించుకుంటా నే నావై నువు తోవైయ్యాక నేస్తమా ఏ
తీరం ఇక దూరం కాదు ప్రాణమా హో నే వేరే, నువ్
వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా
నేనేమో ఎండనైతే నువ్వేమో నా వాన విల్లే ఈ జంట ఉన్న
చోటే వెలగాలలా వాన విల్లే నే రాత్రై నువ్వు పగలైతేనే నేస్తమా
ప్రతి రోజూ ఇక పూర్తయ్యేనే ప్రాణమా హో నే వేరే, నువ్
వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా
నే వేరే, నువ్ వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే
నాకు ప్రాణమా