Album: Nuvvu Nijam
Singer: S. P. Balasubrahmanyam
Music: Akash
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:45
Downloads: 99027
నువ్వు నిజం నీ నవ్వు నిజం కాదని అంటావా? నేను నిజం
నా ప్రేమ నిజం కాదనుకుంటావా? నీలో నా సంతకం చెరిపే వీలున్నదా?
నాలో నీ జ్ఞాపకం కరిగే కల కాదుగా నీకై గుండె తలుపు
తెరుచుకుని నేను వేచివుంటా నువ్వు నిజం నీ నవ్వు నిజం
కాదని అంటావా? నేను నిజం నా ప్రేమ నిజం కాదనుకుంటావా?
దిగులు పడుతుందా గూడెపుడైనా గువ్వ విడిచిందని? ఎదురు చూస్తుంది ఏ క్షణమైనా
తిరిగి వస్తుందని ఎగిరిపోతున్న పావురమా నీ స్వేచ్ఛ ఎన్నాళ్లని? తెలుసుకోలేవు
సంబరమా ఏ చోట ఆగాలని అలసిన నీ రెక్కలకు తీరం నేనవగా
బరువెక్కిన రెక్కలకు చల్లని ఊయలగా నీకై గుండె తలుపు తెరుచుకుని నేను
వేచివుంటా నువ్వు నిజం నీ నవ్వు నిజం కాదని అంటావా?
నేను నిజం నా ప్రేమ నిజం కాదనుకుంటావా? ఎందుకో నువ్వు
పొరబడ్డావు అమృతం చేదని పరుగు తీశావు నిన్నే నువ్వు తప్పుకోవాలని
మందిరం లాంటి మమతల బంధం పంజరం కాదని తెలుసుకుంటావు ఎప్పటికైనా తెంచుకోలేవని
అడుగడుగునా నేలేనా నీడై నీ వెనుకా నిదరొదిలిన నిముషాన నీ ఉదయం
కాగా నీకై గుండె తలుపు తెరుచుకుని నేను వేచి ఉంటా
నువ్వు నిజం నీ నవ్వు నిజం కాదని అంటావా? నేను నిజం
నా ప్రేమ నిజం కాదనుకుంటావా? నీలో నా సంతకం చెరిపే వీలున్నదా?
నాలో నీ జ్ఞాపకం కరిగే కల కాదుగా నీకై గుండె తలుపు
తెరుచుకుని నేను వేచివుంటా