Album: Oh Panchavennala Oh Maradala
Singer: Ghantasala, Swarnalatha
Music: S. Rajeswara Rao
Lyrics: P. Narasimha Rao
Label: Saregama
Released: 1959-12-31
Duration: 02:53
Downloads: 19971
ఓ మరదలా... నాలో పొంగి పొరలే ప్రేమ వరదలా నీరూ పాలూ
కలిసి ఒకటైనటులే... నీవూ నేనూ ఒకటే గదా ఓ పంచవన్నెల
చిలకా... ఆ?... ఆ ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక? ఓ
పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక? మాటాడవేమే... మాటాడవేమే... నీ నోటి
ముత్యాలొలక పంచవన్నెల చిలకా... ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక? ఓహో బావా... మార్చుకో
నీ వంకరటింకర దోవ ఊరికే నీవూ నేనూ ఒకటేననుకుంటే... ఒప్పుతుందా యీ
లోకం? ఓ కొంటె బావగారూ... హాయ్! ఓ కొంటె బావగారూ... మనకెందుకింక
పోరు? ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు? మా నన్నగారు చూస్తే...
మా నన్నగారు చూస్తే... మీ దుమ్ము దులుపుతారు! ఓ కొంటె
బావగారూ... ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు? సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు
సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు ప్రేముందా లేదా... ఓ మరదలా నా మీద?
పంచవన్నెల చిలకా... ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక? మరదలినైతే
మాత్రం మరీ అంత చనువా? మరదలినైతే మాత్రం మరీ అంత చనువా?
మరియాద కాదు మీ బావ మరిది చొరవ ఓ కొంటె
బావగారూ... ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు? మా నన్నగారు చూస్తే...
మా నన్నగారు చూస్తే... మీ దుమ్ము దులుపుతారు ఓ కొంటె
బావగారూ... ఓ పంచవన్నెల చిలకా ఓ కొంటె బావగారూ... ఓ పంచవన్నెల
చిలకా