Album: Ooru Palletooru
Singer: Mangli, Bheems Ceciroleo, Ram Miriyala
Music: Bheems Ceciroleo
Lyrics: Kasarla Shyam
Label: Aditya Music
Released: 2023-02-06
Duration: 04:07
Downloads: 8617821
ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు ఎప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ
యక్క ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావా ఏంటీ నీ పాసుగాల
కోలో నా పల్లె కోడి కూతల్లే పొద్దిరుసుకుందే కోడె లాగల్లే యాప
పుల్లల చేదు నమిలిందే రామ రామ రామ రామ తలకు పోసుకుందే
నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్నే సద్ది మూటల్నే
సగ బెట్టుకుందే బాయి గిరక నా పల్లే హే తెల్లా తెల్లాని
పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగ మోగుత
ఉంటయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన
ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా సల్లగాలి మోసుకొచ్చెరా సేను సిల్కల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మల రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు
కాల్వ గట్టులు సెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఆ
ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే
ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే
ఎదుగుతున్న సంబరాల పంటపైరు ఆ వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ రామ మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే ఆలు మగలు ఆడే ఆటలు అత్త
కోడండ్ల కొట్లాటలు సదిరి సెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద
ఆటలు చాయబండి కాడ మాటలు ఒచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి
తట్ట బుట్టలల్ల కూర తొక్కులు సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు చేతనైన
సాయం జేసే మనుషులు మావి పూత కాసినట్టే మనుసులు ఊరంటే రోజు
ఉగాది సచ్చేదాకా ఉంటది యాది ఊరు నా ఊరు దీని తీరే
అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు
దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్నా సంబరాల పంటపైరు
ఆ వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడు
నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే రామ రామ రామ
రామ మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల
ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి
పల్లే