Album: Atu Itu Ooguthu
Singer: Sreerama Chandra
Music: Mickey J Meyer
Lyrics: Anantha Sriram
Label: Aditya Music
Released: 2012-07-27
Duration: 05:27
Downloads: 2113061
అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది చకచక
దూకుతూ తడబడి తుళ్లుతూ తలపుని తరుముతోంది వయసుకేమయింది నీ వలనే ఇదిలా
మొదలైందే, నా మాటే వినదే ప్రేమా ఏ? నా ప్రాణం
తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా ఏ? నా వెంటే ఉంటావు
నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమయింది జాబిలికి జలుబును తెచ్చే చలువ నీదే
సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీదే మేఘమును మెలికలు తిప్పే మెరుపు
నీవే కాలముని కలలతో నింపే కథవి నీవే మౌనం నీ భాషైతే
చిరునవ్వే కవితౌతుందే నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే నీ వలనే ఇదిలా
అవుతోందే, నా మాటే వినదే ప్రేమా ఏ? నా ప్రాణం
తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా ఏ? నా వెంటే ఉంటావు
నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమయింది మామూలుగ అనిపిస్తుందే నువ్వు వస్తే మాయవని
తెలిసొస్తుందే లోతు చూస్తే మంటవలె వెలుగిస్తావే దూరముంటే మంచువలె లాలిస్తావే చేరువైతే
విరబూసే పువ్వైనా మరునాడే చూస్తది అంతం నువు పూస్తే నూరేళ్లూ విరిసేను
జీవితం నీ వలనే ఇదిలా జరిగిందే, నా మాటే వినదే
ప్రేమా ఏ? నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా
ఏ? నా వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు
ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది