Album: Chali Gaali Chuudduu
Singer: Haricharan, Padmalatha, Malvika Sriram
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2016-05-22
Duration: 04:27
Downloads: 3549771
చలిగాలి చూద్దూ తెగ తుంటరి గిలిగింత పెడుతున్నది పొగమంచు చూద్దూ మహ
మంచిది తెరచాటు కడుతున్నది నన నన్నాన నన్నాన కథ ఏమిటి
నన నన్నాన నన్నాన తెలుసా మరి ఇక ఈపైన కానున్న కథ
ఏమిటి అది నీకైన నాకైన తెలుసా మరి అయినా వయసిక ఆగేనా
మనమిక మోమాట పడకూడదంటున్నది చలిగాలి చూద్దూ తెగ తుంటరి గిలిగింత
పెడుతున్నది పొగమంచు చూద్దూ మహ మంచిది తెరచాటు కడుతున్నది ఎటు
పోతున్నాం అని అడిగామా ఎదురుగ వచ్చే దారేదైనా ఏమైపోతాం అనుకున్నామా జత
పరుగుల్లో ఏం జరిగినా శ్రుతిమించే సరాగం ఏమన్నది మనమిక మోమాటపడకూడదంటున్నది
చలిగాలి చూద్దూ తెగ తుంటరి గిలిగింత పెడుతున్నది పొగమంచు చూద్దూ మహ
మంచిది తెరచాటు కడుతున్నది కలతే ఐనా కిలకిలమనదా మన నవ్వులలో
తానూ చేరి నడిరేయైనా విలవిలమనదా నిలువున నిమిరి ఈడావిరి మతిపోయేంత మైకం
ఏమన్నది మనమిక మోమాటపడకూడదంటున్నది పొగమంచు చూద్దూ మహ మంచిది తెరచాటు
కడుతున్నది చలిగాలి చూద్దూ తెగ తుంటరి గిలిగింత పెడుతున్నది