Album: Chandamama
Singer: Sunitha, Kalyan Mallik
Music: M. M. Keeravani
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 04:39
Downloads: 2306593
చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో బాలమిత్ర
కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో నా
కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీ పగడపు దీవికి నువ్వే నన్ను
తీసుకెళ్తావనీ ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామనీ నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో నువ్వే నాకు ముద్దొస్తావనీ నేనే నీకు ముద్దిస్తాననీ
నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో వరహాల బాటలోన
రతనాల తోటలోన వజ్రాల మేడలోన బంగరు గదిలోన విరి తేనెల్లో పాలల్లో
తానాలాడేసి నెల వంకల్లో వెన్నెల్నే భోంచేసి నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి
చిలకే కొరికి దరికే జరిగి మురిపెం పెరిగి మరి నువ్వే నాకు
ముద్దిస్తావనీ ముద్దుల్లోన ముద్దవుతాననీ నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో
చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి
ఎంత బాగుందో ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి నడిచేటి చేపలొచ్చి
అడవికి రమ్మనగా అహ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి ఆ కొమ్మల్లో పళ్ళన్నీ
రుచి చూసి అహ కళ్ళళ్ళో మైకం తో మోహం కమ్మేసి చలిగా
గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
తడి వేదాలు ముద్రిస్తావనీ నమ్మడానికి ఎంత బాగుందో నీ కోసం
రెక్కల గుర్రం ఎక్కి వస్తానని పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తాననీ
ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి
ఎంత బాగుందో