Album: Edo Oka Raagam Female
Singer: K. S. Chithra
Music: S.A. Rajkumar
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2019-07-16
Duration: 04:25
Downloads: 141071
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ నాలో నిదురించే గతమంతా
కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో
చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే
ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ నాలో నిదురించే
గతమంతా కదిలేలా అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అపుడపుడు
చెమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే
పుట్టే సిగ్గు జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా గుళ్ళో కథ వింటూ నిదురించిన
జ్ఞాపకమే బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం
జ్ఞాపకమే నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం జామపళ్ళనే దోచే తోట
జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ నాలో నిదురించే
గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి
ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు,
జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ నాలో
నిదురించే గతమంతా కదిలేలా