Album: Kadile Kalama
Singer: K.J. Yesudas, K. S. Chithra
Music: Koti
Lyrics: Sri Harsha
Label: Aditya Music
Released: 2019-07-16
Duration: 04:54
Downloads: 2129606
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా పేగే
కదలగా సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
లాలించే తల్లీ పాలించే తండ్రీ నేనేలే నీకన్నీ కానున్న అమ్మా నీ
కంటి చెమ్మ నే చూడలేనమ్మా కన్నీళ్ళలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులే కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
పేగే కదలగా సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసిరూపం నీ రాణితనము
నా రాచగుణము ఒకటైన చిరుదీపం పెరిగేనులే నా అంశము వెలిగేనులే మా
వంశము ఎన్నెన్నో తరములు తరగని యశములకు ఎన్నో నోములే గతమందు నోచి
ఉంటా నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా నడిచే దైవమ నీ
పాదధూళులే పసుపు కుంకుమలు నాకు ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా సాహిత్యం: సాయి శ్రీ
హర్ష