Album: Gopala Baludamma
Singer: K. S. Chithra
Music: S.V. Krishna Reddy
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:18
Downloads: 1009151
గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మా
రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో
తెలుసా నాన్న నిను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకొనే నీ
బొమ్మనురా గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్న
తనివి తీరదమ్మా గుండె మీద తాకుతుంటే నీ చిట్టి పాదం
అందే కట్టి ఆడుతుందే ఈ తల్లి ప్రాణం ఉంగాలతోనే సంగీత పాఠం
నేర్పావ నాకు నీ లాలి కోసం ఉగ్గు పట్టనా దిష్టి తగలని
చుక్కపెట్టనా బోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ
పలకరిస్తావు గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్న
తనివి తీరదమ్మా ఏ నోము ఫలమో పండి ఈ మోడు
కొమ్మ ఈనాడు నిన్నే పొంది అయిందిరా అమ్మా ఇదే నాకు నేడు
మరో కొత్త జన్మ ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ మూసి ఉంచిన
లేత పిడికిలి ఏమి దాచేరా నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన వరములన్నీ
గుప్పిట ఉంచి అమ్మకిచ్చావు గోపాల బాలుడమ్మా నా చందమామ పదే
పదే చూసుకున్న తనివి తీరదమ్మా రారా కన్నా కడుపారా కన్నా నా
చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నిను ఆడించే నీ
అమ్మనురా నువ్వు ఆడుకొనే నీ బొమ్మనురా