Album: Gunde Enduku Echavura
Singer: S. P. Balasubrahmanyam
Music: Ghantadi Krishna
Lyrics: Varikuppala Yaadagiri
Label: Aditya Music
Released: 2000-04-01
Duration: 05:12
Downloads: 659219
అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ గుండెనెందుకిచ్చావురా, దేవుడా ఎండమావి చేశావురా,
దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావు మరు నిమిషంలో విషముగ మరిగిస్తావు గుండెనెందుకిచ్చావురా
దేవుడా (ఓం, ఓం, ఓం, ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతః
నిదహాతి వేదః సనః) మనసు మనసుతో ముడివేసి మౌన ప్రేమతో
పెనవేసి ఒకరికొకరుగా తోడును చేస్తావు ఒకరి నీడలో ఒకరిని చూస్తావు
(అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్)
వలపు దీపాలు వెలిగించి వేల వెన్నెలలు కురిపించి కలల కాలాన్ని కరిగించేస్తావు
శిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు ఆడినంతసేపాడుకొని బొమ్మలన్ని విసిరేస్తావు ఊహ తెలియని
పసిపాపై బొమ్మరిల్లు తన్నేస్తావు ఏ మాయ తెలియని పసి హృదయాలను తలో
దిక్కుగా విసిరికొడతావు గుండెనెందుకిచ్చావురా దేవుడా आपका प्यार सच्चा है
आपका दिल सच्चा हे अल्लाह आपके साथ हे अल्लाह
आपको रेहम करेगा ఎదను గుడిలాగ మార్చేసి ఎదుట దేవతను
చూపించి ప్రేమ పూజలే జరిపించేస్తావు వింత మాయలో పడదోచేస్తావు (అల్లాహ్
అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్) బ్రతుకు
హారతిగ వెలిగించి వెతల పాత్రలో కరిగించి వెలుగు రేఖలను నిలువుగ కోస్తావు
విలువ చీకటిగా మిగిలించేస్తావూ నిండు ప్రాణాలు కదిలిపోతుంటె కంటి నీటితో కాల్చేవు
బండరాయిగా నువ్వుంటావు కనుకనే బాధ పడలేవు ఈ మాయలన్ని ఇక నీకే
తెలుసని మనిషిని పట్టుకు వేధిస్తావు గుండెనెందుకిచ్చావురా, దేవుడా ఎండమావి చేశావురా,
దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావు మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు గుండెనెందుకిచ్చావురా
ఓ దేవుడా