Album: Matrudevobhava
Singer: S.P. Balasubrahmanyam, Malavika, M.M. Keeravani
Music: M.M. Keeravani
Lyrics: Suddala Ashok Teja
Label: Aditya Music
Released: 2018-06-14
Duration: 06:04
Downloads: 837845
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను పితృదేవోభవ అన్న మాట విడిచాను నా
పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్న అని ఒక్కసారి
పిలిచీ కనుమూయాలని ఉన్నది అమ్మా నాన్నా అమ్మా అమ్మా ఒకసారి నిన్ను
చూసి చనిపోవాలని ఉన్నది నాన్న అని ఒక్కసారి పిలిచీ కనుమూయాలని ఉన్నది
అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి నీ
ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావనీ నీ నెత్తుటి ముద్దయే నా
అందమయిన దేహమనీ బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురనీ తెలియనైతి
తల్లీ ఎరుగనైతిని అమ్మా కడుపు తీపినే హేళన చేసిన జులాయిని కన్న
పేగుముడిని తెంపివేసిన కసాయినీ మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను
కరుణించొద్దు నాన్నా నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని నీ
చూపుడు వేలుతో లోకాన్నే చూశానని నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందుననీ
అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెననీ తెలియనైతి తండ్రీ ఎరుగనైతి
నాన్నా నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని మరచిపోయి
కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నను కరుణించొద్దు నాన్నా కన్నా
నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం మా ఆయువు పొసుకోని
నీవు వర్దిల్లు కల కాలం శతమానం భవతి శతాయుష్మాం భవ శతమానం
భవతి శతాయుష్మాం భవ