Album: Aakasham Loni
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: Mani Sharma
Lyrics: Jonnavitthula
Label: Aditya Music
Released: 2018-06-14
Duration: 04:43
Downloads: 1167788
ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే
నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ
బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ
ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నింగిలో నీలమంత ఉంగరం
చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్ని గవ్వల గౌను చేస్తా గారాం
చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలనీ ఆడేందుకు
రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యేలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా
మారే ఆ చుక్కలే దిష్టంతా తీసే నలుదిక్కులే పాపలో అందమంత
బ్రహ్మకే అందనంతా ఎంతో వింతా అమ్మలో ప్రేమ అంత నాన్నలో తీపి
అంతా వచ్చేనంతా తియ్యని నవ్వేమో దివి తారల వెలుగంతా కమ్మని పిలుపేమో
ఈ అమ్మకి పులకింతా అడుగేసి తీస్తే హంస జోడి కులుకుల్లో తానే
కూచిపూడి చిరునవ్వులోన శ్రీ రమణి మారాము చేసే బాలమణి ఆకాశంలోని
చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని
ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే