Album: Naa Chandamama
Music: Ghantasala, P. Susheela
Lyrics: Samudrala Sr.
Label: Saregama
Released: 1964-12-31
Duration: 05:00
Downloads: 10110
నా వాలుజడ కృష్ణవేణి. నా పూలజడ వెన్నెల గోదారి నా ఒళ్లు
గంగమ్మ పరవళ్లుగా... నా ఒళ్లు గంగమ్మ పరవళ్లుగా... నర్తన చేసిన రతిని...
భారతిని కూచిపూడి భారతికి హారతిని. భారతిని నా వాలుజడ కృష్ణవేణి. నా
పూలజడ వెన్నెల గోదారి చరణం 1: ఏ జన్మలో
మల్లెపూ పూజ చేశానో కుందరదనైనాను ఏనాటి కార్తీక దీపాల వెలుగో. ఇందువదననైనాను
అమరావతి బౌద్ధ ఆరామ శిల్పాల వైరాగ్య భావాల దీకావిరంగు. ఈ చీర
చెంగు మమత. సమత. మతమై వెలసిన మధుర భారతి వీణను. నెరజాణను
నేను నా వాలుజడ కృష్ణవేణి. నా పూలజడ వెన్నెల గోదారి
చరణం 2: ఈ నాల్గు వేదాల పాఠాలు విన్నానో.
హంసగమననైనాను ఏ నాసికత్వాల వాదాలు విన్నానో. గగన జఘననైనాను క్షేత్రయ్య పదకీర్తనావేశ
నాట్యాల రాజ్యాలలో చిందు నా కాలి చిందు. మీ కళ్లవిందు శ్రుతికి.
లయకి. సుతనై పుట్టిన మధుర భారతి వీణను. నెరజాణను నేను
నా వాలుజడ కృష్ణవేణి. నా పూలజడ వెన్నెల గోదారి నా ఒళ్లు
గంగమ్మ పరవళ్లుగా... నా ఒళ్లు గంగమ్మ పరవళ్లుగా... నర్తన చేసిన రతిని...
భారతిని కూచిపూడి భారతికి హారతిని. భారతిని నా వాలుజడ కృష్ణవేణి. నా
పూలజడ వెన్నెల గోదారి